¡Sorpréndeme!

KL Rahul Batting IPL 2025 | పదిహేనేళ్ల తర్వాత చెన్నైలో గెలిచిన ఢిల్లీ | ABP Desam

2025-04-06 0 Dailymotion

 ఈ ఐపీఎల్ లో ఎవరైనా బ్యాటర్ టీమిండియా నుంచి దుమ్మురేపుతున్నారు అంటే ఇద్దరే శ్రేయస్ అయ్యర్..కేఎల్ రాహుల్.  ప్రత్యేకించి కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చూస్తుంటే డ్రాగన్ లను తరిమికొట్టే మాన్ స్టర్ లా కనిపిస్తున్నాడు. ఓపెనర్ గా ఆడుతున్నా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్ దిగుతున్నా సరే ఫరకే పడదన్నట్లుగా తనకు ఎదురే లేదనే విధంగా సాగుతోంది కేఎల్ బ్యాటింగ్. క్లాసిక్ షాట్స్ తో క్రికెట్ అందాన్ని మరింత పెంచుతూ రాహుల్ ఆడుతున్న విధానంతో ఢిల్లీ కి స్ట్రాంగ్ సపోర్ట్ లభిస్తోంది. JFM, ఫాఫ్ డుప్లెసీ లాంటి బ్యాటర్లు ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ టచ్ లోకి  రాకపోయినా మంచి స్కోర్లు ఢిల్లీ నమోదు చేయటంలో టీమ్ ను కేఎల్ రాహుల్ ఒంటి చేత్తో మోస్తున్నాడు. నిన్న కూడా అంతే. చెన్నై మీద చెపాక్ స్టేడియంలో ఆడుతున్నానన్న బెదు రే లేకుండా ఓపెనింగ్ కి వచ్చిన రాహుల్ 51  బాల్స్ లో 77 పరుగులు చేశాడు. 6ఫోర్లు, 3 సిక్సర్లున్నాయి ఇన్నింగ్స్ లో కళాత్మక విధ్వంసంగా సాగుతోంది కేఎల్ బ్యాటింగ్ చేస్తున్న తీరు. రాహుల్ విజృంభణతో 183పరుగులు చేసిన ఢిల్లీ..చెన్నైను 158 పరుగులకే కట్టడి చేసి 25 పరుగుల  తేడాతో విజయం సాధించింది. 2010లో ఆఖరి సారి ఢిల్లీ చెన్నైలో గెలవగా..మళ్లీ 15 ఏళ్ల తర్వాత విజయం సాధించింది. దీనికి కారణమైన కేఎల్ రాహుల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.2020 నుంచి 2025 మధ్యలో ఐపీఎల్లో 8సార్లు రాహుల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోగా..అందులో నాలుగు సార్లు ముంబై, మూడు సార్లు చెన్నై, ఓసారి కోల్ కతా నైట్ రైడర్స్ మీద బీభత్సమైన ప్రదర్శన చేసి ఆ అవార్డును అందుకున్నాడు. అందుకే కేఎల్ డ్రాగన్ లను కొట్టే మాన్ స్టర్ అంటున్నది.